Share News

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు..

ABN , Publish Date - Sep 08 , 2026 | 08:10 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పండువారిపేటలో నిర్వహించే ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు..
CM Chandrababu Naidu

అమలాపురం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10:30 గంటలకు కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమండకు చేరుకోనున్నారు. అనంతరం మాచవరం గ్రామం జయంతినగర్‌కి చేరుకుని.. 10.55 గంటల నుంచి 11.35 గంటల వరకు రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.


అనంతరం 11:40 గంటలకు పండువారిపేట గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:55 గంటల వరకు అక్కడ జరిగే గ్రామసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అర్హులైన రైతులు, లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలను చంద్రబాబు పంపిణీ చేయనున్నారు.


ఆ తర్వాత బుడుంగపేటకు వెళ్లి మధ్యాహ్నం 3:15 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఇరుసుమండ నుంచి బయలుదేరి సాయంత్రం 5:40 గంటలకు ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు సన్నద్ధం అవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 08 , 2026 | 08:14 PM