డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రోజువారీ విచారణ
ABN , Publish Date - Sep 08 , 2026 | 08:11 PM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్యకు సంబంధించిన విచారణను రోజువారీగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
రాజమండ్రి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్యకు సంబంధించిన కేసును రోజువారీగా విచారించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ నుంచి రాజమండ్రి కోర్టులో కేసు విచారణను రోజూ నిర్వహించనున్నారు. కేసు విచారణకు సంబంధించిన వివరాలను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు మీడియాకు వెల్లడించారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా రోజువారీ విచారణకు ఆదేశాలు రావడంతో కేసు మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read:
స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకులు..
ద్రోణి ప్రభావం.. ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు