వైసీపీ నాపై విమర్శలు మానుకోవాలి: మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి
ABN, Publish Date - Sep 07 , 2026 | 07:52 PM
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ వేదికను తీసుకురావడానికి సిద్ధమయ్యారు. విజయవాడలో జరిగిన ఒక కీలక మీడియా సమావేశంలో, రాబోయే దసరా పండుగ నాటికి తన నూతన రాజకీయ పార్టీ జెండా, ఎజెండాను అధికారికంగా ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 07 : ఏ కారణాలతో వైసీపీ నుంచి బయటకు వచ్చారో, తనను బయటకు ఎవరు గెంటారో ఇప్పటికే లేఖలో స్పష్టంగా చెప్పానని మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు. 'వైసీపీలో కోటరీ లేదని, వారంతా అమాయకులని' తన వ్యాఖ్యలను ఖండిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను చెప్పిన అంశాలపై వైసీపీ నేతలు సవాల్ విసిరితే.. మరో లేఖతో మరిన్ని సంచలన నిజాలు బయటపెడతానని వెల్లడించారు. రెండో లేఖ ద్వారా పార్టీ అంతర్గత వ్యవహారాలను ఆధారాలతో సహా బహిర్గతం చేస్తానని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి:
లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
పాక్‌తో మ్యాచ్.. స్మృతి మంధానని ఊరిస్తున్న ఆల్‌టైమ్ రికార్డు
Updated at - Sep 07 , 2026 | 07:56 PM