బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారత మత్స్యకారులు విడుదల
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:20 PM
బంగ్లాదేశ్‌లోని భాగర్ హాట్ జైల్‌లో బందీగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు విడుదలయ్యారు. బంగ్లాదేశ్ డిప్యూటీ సెక్రటరీ, భారత ప్రభుత్వం తరఫున డిప్యూటీ హై కమిషన్ శ్రీ చంద్ర జీత్ సమక్షంలో వీరిని విడుదల చేశారు.
విశాఖపట్నం: బంగ్లాదేశ్‌లోని భాగర్ హాట్ జైల్‌లో నిర్బంధంలో ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. బంగ్లాదేశ్ డిప్యూటీ సెక్రటరీ, భారత ప్రభుత్వం తరఫున డిప్యూటీ హై కమిషన్ అధికారి శ్రీ చంద్ర జీత్ సమక్షంలో మత్స్యకారులను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ కూడా పాల్గొన్నారు. విడుదలైన మత్స్యకారులకు మోంగ్లా పోర్టులో పోలీస్ కస్టడీలో ఉన్న వారి పడవలను అప్పగించి, అక్కడి నుంచి భారతదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
సముద్ర సరిహద్దులు దాటిన కారణంగా గత కొంతకాలంగా బంగ్లాదేశ్ జైలులో బందీగా ఉన్న ఈ మత్స్యకారుల విడుదల కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర స్థాయిలో ఇప్పటికే చర్చలు జరిపారు. వీరిలో విశాఖకు చెందిన 9 మంది మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read:
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే
అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్
Read Latest AP News And Telugu News