విజయవాడ సంస్కృతి, సంప్రదాయాలకు జాతీయ గుర్తింపే లక్ష్యం: ఎంపీ కేశినేని చిన్ని
ABN , Publish Date - Oct 11 , 2026 | 09:44 PM
నగరంలోని పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్ రెండో సీజన్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రారంభించారు.
విజయవాడ, అక్టోబర్ 11: నగరంలోని పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్ రెండో సీజన్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్ తొలి సీజన్‌ను మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభించగా, రెండో సీజన్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
ఇద్దరు యువ నాయకులు రెండు సీజన్లను ప్రారంభించడం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. విజయవాడ ఆతిథ్యం, సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర ప్రత్యేకతలను, ఇక్కడి సాంస్కృతిక వైభవాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విజయవాడ ఉత్సవ్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎలాంటి సమస్య ఎదురైనా చిరునవ్వుతో స్పందించి పరిష్కరించడం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకత అని ఎంపీ కేశినేని చిన్ని కొనియాడారు. విజయవాడ ఉత్సవ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖను ఒక అవార్డుగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎంతో సహకారం అందించారని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు ఎప్పుడు సమాచారం ఇచ్చినా స్పందిస్తూ, విజయవాడ ఉత్సవ్ నిర్వహణలో భాగస్వామ్యం అయినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు విజయవాడ నగర విశిష్టతను చాటిచెప్పే ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశమని ఎంపీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...
అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...
Read Latest AP News And Telangana News And International News And Telugu News