Share News

త్వరలో కొత్త పార్టీ ప్రారంభిస్తా: విజయసాయిరెడ్డి

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:22 PM

ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అన్ని కులాలు, మతాలను కలుపుకుని వైసీపీ, కూటమి పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తామని ఆయన తెలిపారు..

త్వరలో కొత్త పార్టీ ప్రారంభిస్తా: విజయసాయిరెడ్డి
vijayasai reddy on tirumala laddu new party

తిరుపతి, అక్టోబర్ 8: ఏపీ రాజకీయ క్షేత్రంలో ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి త్వరలోనే రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే పలు అంశాలపై ఆయన ప్రసంగించారు.


తిరుమల లడ్డూ కల్తీ వాస్తవమే: విజయసాయిరెడ్డి

తిరుమల లడ్డూ తయారీలో అక్రమాలు జరిగిన విషయం వాస్తవమేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. లడ్డూ తయారీలో కల్తీ జరిగిన మాట నిజమేనని.. కానీ అందులో ఎలాంటి జంతు సంబంధమైన కొవ్వు పదార్థాలూ లేవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కిలో నెయ్యి రూ.320 నుంచి 400 రూపాయలకే కొనుగోలు చేసిందని.. ప్రస్తుత ప్రభుత్వం కిలో రూ.658లకు కొనుగోలు చేస్తోందన్నారు. స్వచ్ఛమైన నెయ్యి ధర కిలోకి వెయ్యి రూపాయలకు పైగానే పలుకుతుండగా.. మరి వీరు వాడుతున్నది స్వచ్ఛమైన నెయ్యి ఎలా అవుతుందని ఆయన నిలదీశారు.


కడపలో దళితులను ఆలయం లోపలికి కూడా రానివ్వడం లేదని విజయసాయి రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దళితులపై వివక్ష చూపేవారిని కఠినంగా శిక్షిస్తామని.. వారిని జైలుకు పంపుతామన్నారు. కొత్తపార్టీ ద్వారా అన్ని మతాలు, కులాలను కలుపుకొనిపోతామని.. రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీగా నిలుస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు కులమతాలను రాజకీయాలకు వాడుకోవద్దని ఆయన హితవు పలికారు.


ఈ వార్తలనూ చదవండి:

గగనతలంలో ఉండగా విమానంపై పిడుగుపాటు

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. గర్భిణీ సహా బాలిక మృతి

Updated Date - Oct 08 , 2026 | 12:48 PM