అనకాపల్లి జిల్లాలో విషాదం.. స్నానానికి నదిలో దిగిన ముగ్గురు యువకుల గల్లంతు
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:50 PM
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరాహ నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన జిల్లాలోని రాయవరం మండలంలోని పెనుగొల్లు గ్రామంలో చోటుచేసుకుంది.
అనకాపల్లి, నవంబర్ 14: జిల్లాలోని రాయవరం మండలం.. పెనుగొల్లు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపాన గల వరాహ నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా.. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నదిలో గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. అధికారులకు ఫోన్ చేస్తూ.. ఎప్పటికప్పుడు వారి ఆచూకీ గురించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో గాలింపు చర్యల పురోగతిని హోంమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్