Share News

గెలుపు మనదే కావాలి

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:02 AM

‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపు మనదే కావాలి. కొందరు దింపుడు కళ్లెం ఆశతో ‘సర్‌’, రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లారు. వారి ఆశలు నిరాశ కావాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ రెండో రోజున ఆయన మాట్లాడారు.

గెలుపు మనదే కావాలి

  • స్థానికంలో అన్ని స్థానాల్లో దూసుకెళదాం

  • కొందరు దింపుడుకళ్లెం ఆశతో సర్‌, కోటాపై కోర్టులకు వెళ్లారు.. వారికి నిరాశే మిగలాలి

  • దుష్ప్రచారం తిప్పికొట్టి ప్రజలకు దగ్గరవుదాం

  • మద్యం దుకాణాలన్నింటికీ రెన్యువల్‌: సీఎం

అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపు మనదే కావాలి. కొందరు దింపుడు కళ్లెం ఆశతో ‘సర్‌’, రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లారు. వారి ఆశలు నిరాశ కావాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ రెండో రోజున ఆయన మాట్లాడారు. మేయర్లు, చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలని నిర్ణయించామని, అవకతవకలు లేకుండా చూడాలనే ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. ఉత్తమ అభ్యర్థులను నిలిపేలా ప్రతి ఒక్కరం జాగ్రత్త పడాలని కోరారు. ‘‘గెలుపే ధ్యేయంగా పనిచేయడంతో పాటు కూటమిగా సమన్వయం చేసుకోవాలి. విశాఖ నార్త్‌ మినహా నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించాం. రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి. పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే సస్పెన్షన్‌ వేటు వేసేందుకూ వెనుకాడను’ అని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ డ్రామాలరాయుడి కట్టుకథలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ‘‘గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దు. చేసిన అభివృద్ధి-సంక్షేమం గురించి నిరంతరం చెప్పుకోవాలి. సోషల్‌ మీడియా సహా వివిధ మార్గాల్లో అందరినీ ఇందులో భాగస్వాములను చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయాలి. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించేలా చర్యలు చేపట్టాలి. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ సహా పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నాం.


దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీకి, కూటమికి చెందిన వారిని ప్రత్యర్థులు విమర్శిస్తే, టీమ్‌ స్పిరిట్‌తో కౌంటర్లు ఇవ్వాలి. ఫేక్‌ ప్రచారం మీదే ఆధారపడి గొడ్డలి పార్టీ రాజకీయం చేస్తోంది. రాష్ట్రానికి గూగుల్‌ వస్తే ఇతర రాష్ట్రాలు అసూయపడ్డాయి. కానీ ఇక్కడ కొందరు కుట్రలతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీటిపై ప్రజలకు వాస్తవాలు వివరించడంతోపాటు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కూడా రాజకీయాల్లో ముఖ్యం. లిక్కర్‌ స్కామ్‌, వివేకా హత్య, ఏపీపీఎస్సీ అక్రమాలపై గొడ్డలి పార్టీ మాట్లాడదు. డీఎస్సీపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తోంది. కుప్పం వెళ్లి టీచర్లను బెదిరించే స్థాయికి ఆ పార్టీ మీడియా దిగజారింది. ఈ స్థాయిలో బరితెగించేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. రాబోయే కాలంలో సోషల్‌ మీడియా చాలా కీలక పాత్ర పోషించబోతోంది. పాత పద్ధతుల్లోనే రాజకీయం చేస్తామంటే వేగం అందుకోలేరు’’ అని చెప్పారు. గత పాలనలో మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేశారని, నకిలీ, జే బ్రాండ్లు విక్రయించడంతో, వాటిని తాగి 30 వేలమంది ప్రాణాలొదిలారని తెలిపారు. ఇప్పుడు వాటన్నిటినీ నియంత్రించి, విక్రయాలను పారదర్శకంగా చేస్తున్నామన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

12న జాతీయ లోక్‌అదాలత్‌

జూట్‌మిల్లు కార్మికులకు బకాయిల చెల్లింపు

Updated Date - Sep 09 , 2026 | 04:02 AM