తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఏపీ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:58 PM
తమిళనాడు రాజకీయాల్లో ఏపీ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రకంపనలు రేపుతోంది. సమ్మిట్ అంశమై.. ప్రభుత్వ అధినేత విజయ్, డీఎంకే అధినేత స్టాలిన్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది.
అమరావతి, నవంబర్ 19: తమిళనాడు రాజకీయాల్లో ఏపీ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రకంపనలు రేపుతోంది. సమ్మిట్ అంశమై.. ప్రభుత్వ అధినేత విజయ్, డీఎంకే అధినేత స్టాలిన్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని పెట్టుబడుల రహస్యాలను ఏపీకి చేరవేస్తున్నారన్న ఆరోపణలతో విజయ్ ప్రభుత్వం 15 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం వేదికగా నవంబర్ 12, 13 వ తేదీల్లో ‘పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్’ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ జరిగిన కొన్ని రోజులకే నవంబర్ 2వ తేదీన డీఎంకే అధినేత స్టాలిన్.. పరిశ్రమలు తమిళనాడు నుంచి ఏపీకి వెళుతున్నాయంటూ సోషల్ మీడియాలో పెట్టారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న సీఎం విజయ్.. తమిళనాడు పరిశ్రమశాఖలోని పెట్టుబడుల రహస్యాలు ఏపీకి చేరవేస్తున్నారన్న ఆరోపణలపై 15 మంది ఉద్యోగులపై వేటు వేశారు.
పరిశ్రమల శాఖకు సలహాలు ఇచ్చే ‘గైడెన్స్ తమిళనాడు’ అనే సంస్థలోని 15 మంది ఉద్యోగులను తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఉద్యోగం పోయిన 15 మందిలో.. ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డులో చేరినట్లు ప్రకటించడంతో.. ఈ వివాదం మరింత ముదురుతోంది. కాగా.. తమిళనాడులో ఏర్పాటు చేయాల్సిన దక్షిణ కొరియాకు చెందిన రెండు పరిశ్రమలు.. 1400 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనంతపురంలో ఏర్పాటుచేసేందుకు ఏపీతో ఎంవోయూలు కుదుర్చుకోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు