Share News

ఫోన్ మాట్లాడుతూ మేడపై నుంచి జారి యువకుడి మృతి

ABN , Publish Date - May 08 , 2026 | 12:48 AM

స్థానిక మున్సిపాలిటీ పరిధి చిన్నబడాం గ్రామం వద్ద బుధవారం రాత్రి సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ మేడపై నుంచి జారిపడి కురిటి వినోద్‌(33) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల మేరకు.. వినోద్‌కుమార్‌ మేడపై నిద్రించ డానికి వెళ్లాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ జారి పడి మృతి చెం దాడు.

ఫోన్ మాట్లాడుతూ మేడపై నుంచి జారి యువకుడి మృతి

  • మేడపై నుంచి జారిపడి యువకుడు మృతి

పలాస, మే 7(ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపాలిటీ పరిధి చిన్నబడాం గ్రామం వద్ద బుధవారం రాత్రి సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ మేడపై నుంచి జారిపడి కురిటి వినోద్‌(33) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల మేరకు.. వినోద్‌కుమార్‌ మేడపై నిద్రించ డానికి వెళ్లాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ జారి పడి మృతి చెం దాడు. గురువారం ఉదయం తన భర్త ఎంతకీ కిందికి రాలేదని భార్య చూడగా అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించారు. అనంతరం ఆయన్ని పరిశీలించగా.. మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి చెవిలో ఇయర్‌బడ్డ్‌, చేతిలో సెల్‌ ఫోన్‌ ఉండడాన్ని పోలీసులు గుర్తిం చారు. ఎస్‌ఐ నర్సింహమూర్తి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వినోద్‌కి భార్య రినీష, మూడేళ్ల వయస్సు గల కుమార్తె ఉండగా.. ప్రస్తుతం రినీష ఏడు నెలల గర్భవతి.

Updated Date - May 08 , 2026 | 07:22 AM