Share News

మూలపేట పోర్టుపై విష ప్రచారం.. వైసీపీపై మంత్రుల ఫైర్

ABN , Publish Date - Apr 06 , 2026 | 03:44 PM

శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల ఆకాంక్ష మూలపేట పోర్టు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నవంబర్‌ నాటికి పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.

మూలపేట పోర్టుపై విష ప్రచారం.. వైసీపీపై మంత్రుల ఫైర్
Mulapeta Port

శ్రీకాకుళం, ఏప్రిల్ 6: మూలపేట పోర్టును మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు ఈరోజు(సోమవారం) పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ మాట్లాడుతూ..మూలపేట పోర్టును పరిశీలించామని.. ప్రాజెక్ట్‌ నిర్మాణంపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల ఆకాంక్ష మూలపేట పోర్టు అని అన్నారు. రూ.4,360 కోట్లతో పోర్టు నిర్మాణం చేపట్టామని.. 1,524 ఎకరాల్లో 4 బెర్త్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. మూలపేట పోర్టును 2026 నవంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.


గత ప్రభుత్వంలో 20 శాతం పనులు మాత్రమే చేశారని.. ప్రస్తుతం 70.54 శాతం పనులు పూర్తైనట్లు మంత్రి తెలిపారు. 20 నెలల్లోనే 49.63 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి అయినట్లు వెల్లడించారు. కర పత్రిక అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు. పోర్టు కోసం కావల్సిన ఉప్పు భూముల విషయంలో వైసీపీ చిత్తశుద్ధితో పని చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఉప్పు భూముల కోసం కేంద్రంతో సంప్రదింపులు చేశామని.. 385 ఎకరాల ఉప్పు భూములను లీజ్‌పై కేంద్ర కేటాయించిందని వివరించారు.


వైసీపీ నేతలు 20 నెలల తరువాత రాజకీయం చేస్తున్నారని.. ఈ 20 నెలలు నిద్ర పోయారా అంటూ మంత్రి ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసమే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అందుకే బుద్ధి చెప్పారన్నారు. రాజధాని అని చెప్పినా ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదని తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడుదాం రండి అంటూ జగన్, వైసీపీ నేతలకు మంత్రి ఛాలెంజ్ విసిరారు. గతంలో అమరావతికి ఓకే అన్న జగన్.. మోసం చేసి తరువాత మూడు ముక్కలు ఆట ఆడారని మండిపడ్డారు. జగన్ అభివృద్ధి చేసే నాయకుడు కాదని.. విధ్వంసం సృష్టించే నాయకుడంటూ వ్యాఖ్యలు చేశారు. అందుకే 11సీట్లకి పరిమిత మయ్యారన్నారు. దేశంలో ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్‌లలో బోగాపురం నంబర్ 2గా నిలవనుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.


మూలపేట వాసులు త్యాగదనులు: మంత్రి అచ్చెన్నాయుడు

మూలపేట పోర్టు పనులు 20 శాతం నుంచి 76 శాతం పూర్తి చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పోర్టులో షిప్ వచ్చి ల్యాండ్ అయ్యిందని.. బెర్త్‌లు లేకుండా షిప్ రాదు కదా అని అన్నారు. పోర్టు కట్టిన తరువాత రోడ్డు, రైల్ రవాణా అవసరం ఉంటుందన్నారు. పోర్టు కోసం సాల్ట్ ల్యాండ్‌‌లు అవసరమని చెప్పుకొచ్చారు. 385 ఎకరాల సాల్ట్‌ భూములను కేంద్రం లీజ్‌కు ఇచ్చిందని.. దానిపై కూడా ఒకరు కోర్టుకు వెళ్లారన్నారు. పోర్టును నవంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఫారెస్ట్ ల్యాండ్, జెన్ కో పవర్ సమస్యలను వీలైనంత త్వరగా అధిగమిస్తామని చెప్పారు. అడ్డగోలుగా పూర్తి చేసినట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూలపేట వాసులు త్యాగదనులని కొనియాడారు. పోర్టు వల్ల ఎంప్లాయిమెంట్ రాదని.. పోర్టు పరిసరాల్లో పరిశ్రమలు రావాల్సి ఉందని చెప్పారు. 17 కంపెనీలు ల్యాండ్ కోసం దరఖాస్తు చేశాయని తెలిపారు. మూలపేట పోర్టును సందర్శించడానికి వైసీపీని ఆహ్వానిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.


ఇవి కూడా చదవండి...

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ: డిప్యూటీ సీఎం పవన్

చల్లపల్లి ఘటనలో గాయపడ్డ పోలీసులను పరామర్శించిన హోం మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 04:22 PM