Share News

ర్యాష్ డ్రైవింగ్ కేసు.. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడి అరెస్ట్

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:33 PM

మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు అరవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ కేసుకు సంబంధించి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.

ర్యాష్ డ్రైవింగ్ కేసు.. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడి అరెస్ట్
Rash Driving Case

శ్రీకాకుళం, జులై 13: మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు అరవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ కేసుకు సంబంధించి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. మూడు రోజుల క్రితం కాశీబుగ్గలో అతివేగంగా బైక్ నడిపి.. దానయ్య అనే గొర్రెల కాపరిని మాజీ మంత్రి కుమారుడు బలిగొన్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరవ్ వ్యవహారం బయటపడింది. కుమారున్ని కేసు నుంచి తప్పించేందుకు అప్పలరాజు చేసిన డ్రామాలను పోలీసులు బయటపెట్టారు. తొలుత ఈ కేసులో సిద్ధు అనే యువకుడు తానే బైక్ నడిపి ప్రమాదం చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.


కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు. ప్రమాదానికి ముందు సమీపంలోని పెట్రోల్ బంక్‌లో అరవ్ పెట్రోల్ పోయించుకున్న వీడియోలూ బయటపకు వచ్చాయి. అలాగే ప్రమాదం జరిగిన రోజు పలాసలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుమారుడికి అప్పలరాజు చికిత్స చేయించారు. ఆసుపత్రి వీడియోలు బయటకు రావటంతో మాజీ మంత్రి డ్రామాలకు ఫుల్ స్టాప్ పడినట్లైంది.


ఇవి కూడా చదవండి..

ఏడు బస్సులు అగ్నికి ఆహుతి

శ్రీకాకుళం రోడ్డు ప్రమాదం.. అప్పలరాజు కుమారుడే బైక్‌ నడిపినట్లు పోలీసుల నిర్ధారణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2026 | 04:13 PM