16న నరసన్నపేటకు సీఎం రాక
ABN , Publish Date - May 04 , 2026 | 12:08 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 16న నరసన్నపేటలో పర్యటించనున్నట్టు జడ్పీ సీఈవో వెంకట్రామన్ తెలిపారు. మూడో శనివారం నిర్వహించనున్న ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు వెల్లడించారు.
అక్కురాడలో కార్యక్రమం రద్దు
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
జడ్పీ సీఈవో వెంకట్రామన్
నరసన్నపేట, మే 3(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 16న నరసన్నపేటలో పర్యటించనున్నట్టు జడ్పీ సీఈవో వెంకట్రామన్ తెలిపారు. మూడో శనివారం నిర్వహించనున్న ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు వెల్లడించారు. ఈ నెల 9న జలుమూరు మండలం అక్కురాడలో జరగాల్సిన సీఎం పర్యటన కార్యక్రమం రద్దయిందని తెలిపారు. నరసన్నపేటలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం పంచాయతీరాజ్, డ్వామా, డీఆర్డీఏ తదితర శాఖల అధికారులతో జడ్పీ సీఈవో సమీక్ష నిర్వహించారు. ‘సీఎం పర్యటనలో ఇబ్బందులు లేకుండా అధికారులతా సమన్వయంతో పనిచేయాలి. పారిశుధ్య కార్యక్రమాలు మెరుగుపరచాలి. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి. పన్నులు శతశాతం వసూలు చేయాల’ని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీపీవో గోపీబాల, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, ఎంపీడీవో వెంకటేష్ ప్రసాద్, నిశ్చల, రవికుమార్ పాల్గొన్నారు.