విశాఖ రైల్వే స్టేషన్ భద్రతలో కీలక అడుగు..
ABN , Publish Date - Jan 22 , 2026 | 07:10 PM
ఉత్తరాంధ్రకు కీలకమైన విశాఖ రైల్వే స్టేషన్ భద్రత విషయంలో కీలక అడుగు పడింది. ఈ స్టేషన్‌లో రోబో కాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గురువారం రోబ్ కాప్ సేవలను రైల్వే అధికారులు ప్రారంభించారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో సేవలు అందించే రోబో కాప్ కి ఏం పేరు పెట్టారంటే...
విశాఖపట్నం, జనవరి22: విశాఖ రైల్వే స్టేషన్(Visakhapatnam Railway Station) భద్రత విషయంలో కీలక అడుగు పడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF)లో రోబో కాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గురువారం రోబో సేవలను ఆర్‌పీఎఫ్ ఐజీ ఆలోక్ బొహ్ర, వాల్తేరు డివిజన్ డిఆర్ఎమ్ లలిత్ బొహ్ర ప్రారంభించారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో సేవలు అందించే ఈ రోబో కాప్‌కు అర్జున్‌గా నామకరణం చేశారు. భారతీయ రైల్వే వ్యవస్థలోనే రోబో కాప్ సేవలను(RPF robot services) వినియోగించడం ఇదే తొలిసారి. అందుకు విశాఖ రైల్వే స్టేషన్ వేదిక కావడం గమన్హారం. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వెంటనే స్పందించేలా రోబో కాప్‌కి ప్రోగ్రామింగ్ చేశారు. ప్రయాణికుల భద్రతతో పాటు మరెన్నో సేవలు ఈ రోబో కాప్ అందించనుంది.
ఉత్తరాంధ్రలో విశాఖ రైల్వే స్టేషన్ అనేది చాలా కీలకమైనది. నిత్యం వందలాది రైళ్లు ఈ స్టేషన్ మీదుగా వెళ్తుంటాయి. అంతేకాక నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికులకు రక్షణతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు విశాఖ రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక సదుపాయాలు కల్పించిన రైల్వే అధికారులు.. తాజాగా రోబో కాప్ రూపంలో మరో సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రోబో కాప్ సేవలు(Vizag railway station security)అందిచండంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..
అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు నాటండి.!
బడ్జెట్ 2026: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెబుతారా.. ఈ 4 అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.?