Share News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రష్మిక మందన్న.. రిసెప్షన్‌కి ఆహ్వానం..

ABN , Publish Date - Mar 01 , 2026 | 05:53 PM

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ నెల 4వ తేదీన సొంత గ్రామం తుమ్మన్‌పేట ఫామ్‌హౌస్‌లో రిసెప్షన్ వేడుకలు జగనున్నాయి. వివరాల్లోకి వెళితే..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రష్మిక మందన్న.. రిసెప్షన్‌కి ఆహ్వానం..
Rashmika invites CM Revanth Reddy

నాగర్ కర్నూల్ జిల్లా: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఈ జంట తమ సొంత గ్రామంలో రిసెప్షన్ వేడుకలు గ్రాండ్‌గా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన రష్మిక మందన్న తమ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించారు.

raskika.jpg


సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు రష్మిక. ఈ నెల 4వ తేదీన తుమ్మన్‌పేట ఫామ్‌హౌస్‌లో రిసెప్షన్, సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలకు రావాలని ముఖ్యమంత్రి దంపతులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సతీమణి రష్మిక మందన్నకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి, కానుక ఇచ్చారు. ముఖ్యమంత్రి దంపతులు రష్మికను దీవించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ‘సినీ నటుడు విజయ్ దేవరకొండతో ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన సినీ నటి రష్మిక తమ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు’ అంటూ ‘ఎక్స్’ వేదికగా రాసుకొచ్చారు. ముఖ్యమంత్రి దంపతులను సగౌరవంగా ఆహ్వానించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ నెల 4న జరగబోయే రిసెప్షన్ వేడుకలకు సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 01 , 2026 | 06:28 PM