చీరాలలో 6 నెలల శిశువు కిడ్నాప్.. 24 గంటల్లోనే నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Jul 03 , 2026 | 03:35 PM
చీరాలలో 6 నెలల శిశువు కిడ్నాప్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
బాపట్ల, జులై 3: చీరాలలో 6 నెలల శిశువు కిడ్నాప్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిన్న(గురువారం) వేటపాలెం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీలో ఆరుబయట తల్లి పక్కన నిద్రిస్తున్న మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. బిడ్డ కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు 24 గంటల్లో శిశువును కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
శిశువును దాసరి సంజీవరావు, దాసరి శ్రీను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా చిన్నారిని కిడ్నాప్ చేయించిన కట్టా ఆదినారాయణ, కట్టా తిరుమల దంపతులను కూడా టంగులూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు. సంతానం లేకపోవడంతో ఈ దంపతులు శిశువును కిడ్నాప్ చేయించినట్లు విచారణలో తేలింది. శిశువును తెచ్చిస్తే లక్ష రూపాయలు ఇస్తామని నిందితులకు దంపతులు ఆఫర్ చేశారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. 24 గంటల్లోనే కిడ్నాపర్ల చెర నుంచి శిశువుని కాపాడిన పోలీసులు.. ఆపై సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి...
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ సంస్థలకు గ్రీన్ సిగ్నల్
ఏపీ అభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు అవసరం: హోం మంత్రి అనిత
Read Latest AP News And Telugu News