Share News

తిరుపతి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని మోదీ

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:49 PM

ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. జిల్లాలో నిర్వహించే డీజీపీల సదస్సులో పాల్గొన్న అనంతరం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.

తిరుపతి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని మోదీ
pm modi tirupati visit

అమరావతి, నవంబరు 29: జిల్లాలో దేశ ప్రధాని నరేంద్రమోదీ డిసెంబరు 4 నుంచి డిసెంబరు 6 వరకు మూడురోజుల పాటు పర్యటించనున్నారు. తిరుపతి IISER (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) వేదికగా జరగనున్న ‘డీజీపీ, ఐజీపీల సదస్సు - 2026’లో పాల్గొననున్నారు. కార్యక్రమ అనంతరం డిసెంబరు 6వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.


రాష్ట్రంలో తిరుపతి జిల్లాలోని IISER వేదికగా ‘డీజీపీ, ఐజీపీల సదస్సు-2026’ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోదీ.. జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. డిసెంబరు 4 నుంచి డిసెంబరు 6 వ తేదీన వరకు కొనసాగనున్న ప్రధాని పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. డిసెంబర్ 4 శుక్రవారం సాయంత్రం 5:40 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరనున్నారు. రాత్రి 8:30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 9.00 గంటలకు రోడ్డు మార్గంలో తిరుపతి ఐసర్ (IISER) కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.


డిసెంబర్ 5 శనివారం ఉదయం 8:20 నుంచి రాత్రి 9.00 వరకు తిరుపతి ఐసర్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగే డీజీపీలు, ఐజీపీల సదస్సులో పాల్గొంటారు. సదస్సు అనంతరం ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. మరునాడు డిసెంబరు 6వ తేదీన ఉదయం 8:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు డీజీపీలు, ఐజీపీల సదస్సులో పాల్గొంటారు. అదే రోజు ఉదయం 9:25 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి ప్రధాని పుష్పాంజలి ఘటిస్తారు. సదస్సు పూర్తి అయిన అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతి ఐసర్ నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరతారు. 6వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు తిరుమల ఆలయానికి చేరుకుని.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6:25 గంటల వరకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు.


ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 05:49 PM