జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jul 22 , 2026 | 07:28 PM
ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, ముందస్తు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.
అమరావతి, జులై 22: ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, ముందస్తు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి కొరతను ఎదుర్కొనే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో నీటి ఎద్దడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు.
జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా పల్నాడు, ప్రకాశం ప్రాంతాల్లో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని పవన్ సూచించారు. ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ ప్రాజెక్టులు జీవనాధారంగా మారనున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామాల మధ్య పైప్‌లైన్ నిర్మాణం, అటవీ అనుమతులు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించాలని పవన్ ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా నిర్మాణాలను కొనసాగించాలని స్పష్టం చేశారు. భుజం శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతి, నాణ్యతను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దని అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి
ఆధారాలు లేకుండా నాపై నేరం మోపారు: నటి కాదంబరి జెత్వాని లేఖ
పశుగ్రాస కొరతను నివారించేందుకు ప్రత్యేక చర్యలు: ఏపీ పశుసంవర్ధక శాఖ