Share News

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

ABN , Publish Date - Jul 22 , 2026 | 07:05 PM

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని నివాసంలో ఆయన్ని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కుమారుడు ఆరవ్‌ను రోడ్డు ప్రమాదం కేసు నుంచి.. తప్పించేందుకు సీదిరి అప్పలరాజు ప్రయత్నించారు.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
YCP Leader Sidiri Appala Raju

శ్రీకాకుళం, జులై 22: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని నివాసంలో ఆయన్ని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కుమారుడు ఆరవ్‌ను రోడ్డు ప్రమాదం కేసు నుంచి.. తప్పించేందుకు సీదిరి అప్పలరాజు ప్రయత్నించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారాలతో అప్పలరాజు బండారం బయటపడింది. ఈ కేసులో ఇప్పటికే అప్పలరాజు కుమారుడు అరవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ ఈ రోజు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. దీంతో ఆయన నివాసానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.


అప్పలరాజు అరెస్ట్‌ను కుటుంబ సభ్యులతోపాటు పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఇంకో వైపు సోంపేట 6వ అదనపు జిల్లా అండ్ సెషన్స్ కోర్టులో సీదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.


ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్‌తో ఢీ కొట్టడంతో గొర్రెల కాపరి దానయ్య మృ‌తి చెందారు. ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు తీవ్రంగా ప్రయత్నించారు. తన కుమారుడికి బదులుగా సిద్ధార్థ త్యాడి అనే వ్యక్తిని జైలుకు పంపాలని అప్పలరాజు భావించారు. అందుకోసం బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టారని, ప్రమాదానికి కారణమైన బైకును తప్పించి నేరం కప్పిపుచ్చేందుకు చూశారంటూ అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు: కాల్వ శ్రీనివాసులు

విద్యార్థులు, రాహుల్‌కు మద్దతుగా ప్రతి రోజు నిరసనలు: జగ్గారెడ్డి

For More AP News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 07:23 PM