ప్రతీకారానికి నిమిషం చాలు!
ABN , Publish Date - Sep 10 , 2026 | 04:17 AM
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డానంటూ జగన్ హయాంలో నంద్యాలలో తనను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించి బుధవారం నాటికి మూడేళ్లు పూర్తయిందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నేను ముఖ్యమంత్రినయ్యాక ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక్క నిమిషం చాలు
కానీ సహనంతో వ్యవహరిస్తున్నా
నా అక్రమ అరెస్టుకు మూడేళ్లు
కేసులు, ఆరోపణలు రుజువు చేయలేకపోయారు
అధికారంలో ఉండగా అరాచకం.. ఓడాక కుట్రలు
నాడు పవన్‌నూ వేధించారు..
గొడ్డలి పార్టీకి భవిష్యత్ లేదు.. అది ఇక తిరిగిరాదు
2024 మెజారిటీలను 2029లో దాటించాలి
ఈ సంకల్పానికి స్థానిక ఎన్నికలే ట్రయల్
3 పార్టీలూ ఐకమత్యంతో పనిచేయాలి: సీఎం
అమలాపురం/పి.గన్నవరం/అంబాజీపేట, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డానంటూ జగన్ హయాంలో నంద్యాలలో తనను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించి బుధవారం నాటికి మూడేళ్లు పూర్తయిందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నేను ముఖ్యమంత్రినయ్యాక ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక్క నిమిషం చాలు. కానీ నేనా పని చేయలేదు. చాలా సౌమ్యంగా ఉంటానని, ఏమీ చేయలేకపోతున్నానని చాలామంది అన్నారు. కానీ నాకు సహనం ఎక్కువ. నేను చేసే ఏ పని అయినా తెలుగువారికి న్యాయం జరగాలన్నదే నా లక్ష్యం’ అని స్పష్టంచేశారు. మీభూమి-మీహక్కు గ్రామసభలో తొలుత మాట్లాడిన వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రస్తావించారు. నాటి ఘటనలు గుర్తుతెచ్చుకుని సీఎం తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ ప్రసంగించారు. ఆ తర్వాత అంబాజీపేటలో పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశంలో కూడా మాట్లాడారు. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను చర్చించమంటే వచ్చేదే లేదని గొడ్డలి పార్టీ నేతలు మొండికేస్తున్నారని ఆక్షేపించారు. ‘గొడ్డలి పార్టీ పాలకులు మూడేళ్ల కిందట సెప్టెంబరు 9వ తేదీన నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ఏ తప్పూ లేకుండా అరెస్టు చేయడం బాధ కలిగించింది. చాలామంది నాపై ఆరోపణలు చేశారు. కోర్టులకు వెళ్లారు. వాటిని రుజువు చేయలేకపోయారు. అదే నా నిబద్ధత’ అని తెలిపారు. తమ కుటుంబాల గురించి సామాజిక మాధ్యమాలతోపాటు జగన్ రోతపత్రికలో అసభ్యంగా రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఏం చెప్పారంటే..
తెలుగు జాతి మొత్తం రోడ్లెక్కింది..
నాడు నంద్యాలలో ఓ సమావేశానికి వెళ్లిన నన్ను అరెస్టు చేస్తామని అర్ధరాత్రి వచ్చారు. నాపై ఆరోపణలేంటో చెప్పాలని అడిగితే.. అరెస్టు చేశాక చెబుతామన్నారు. ఓ మాజీ సీఎంను ఉన్న పళంగా అరెస్టుచేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. నేను జైల్లో ఉన్న సమయంలో నాకేం జరుగుతుందోనన్న ఆందోళనతో తెలుగుజాతి మొత్తం రోడ్లపైకి వచ్చింది. దేశవిదేశాల్లో సైతం 53 రోజులపాటు నిరంతరం ఆందోళనలు జరిగాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాకు సంఘీభావం తెలిపేందుకు వస్తుంటే ఆయన్ను అడ్డుకున్నారు. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వచ్చి సంఘీభావం తెలిపారు. మాజీ సీఎం వైఎస్‌కి ఆయన కొడుకు విషయంలో జాగ్రత్తలు తీసుకోమని ఆనాడే చెప్పాను. చదువుకోవడానికి అమెరికా పంపిస్తే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు తిరుగు టపాలో వచ్చేశారు. సీఎం తన కుమారుడిని ఏపీకి రానివ్వకుండా బెంగళూరులో పెట్టారంటే.. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఎలాంటి వాడో అర్థం చేసుకోండి.
ఒక్క వార్డులోనూ ఓడిపోకూడదు..
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి భవిష్యత్ లేదని, తిరిగి రాదని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు చెప్పాలి. 2029 సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 2024 ఎన్నికల్లో సాధించిన మెజారిటీలను దాటించే విధంగా టీడీపీ శ్రేణులు పనిచేయాలి. 2029 ఎన్నికలకు ట్రయల్స్ త్వరలో రానున్న స్థానిక ఎన్నికలే. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పనిచేయాలి. ఒక్క వార్డు కూడా ఓడిపోవడానికి వీల్లేదు. 2024లో కూటమికి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 70 శాతం ఓట్లు సాధించాలి. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయకుండా విజయం సాధించాలి.
ఈ వార్తలనూ చదవండి:
రెన్యువల్ అయ్యేలా చర్యలు చేపట్టండి