శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:40 PM
మంత్రాలయం శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3,30,69,139 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్, శ్రీపతిఅచార్ తెలిపారు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ హుండీ లెక్కింపు
మంత్రాలయం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3,30,69,139 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్, శ్రీపతిఅచార్ తెలిపారు. బుధవారం ఆగస్టు, సెప్టెంబరు 8వ తేదీ వరకు 16రోజుల్లో భక్తులు సమర్పించిన హుండీని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కించారు. రూ. 3,30,69,139 నగదుతో పాటు 632 గ్రాముల వెండి, 47 గ్రాములు బంగారు, వివిధ దేశాల కరెన్సీ వచ్చినట్లు చెప్పారు. వచ్చిన నగదును శ్రీమఠం బ్యాంకు ఖాతాకు జమచేసినట్లు తెలిపారు. రాఘవేంద్రస్వామి 355వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా పెద్దమొత్తంలో హుండీ ఆదాయం చేకూరడంతో శ్రీమఠం అధికారులు, ఉద్యోగులు సమష్టిగా భక్తులకు సేవలు అందించడంతో సాధ్యమైందని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు సిబ్బందిని అభినందించారు. ఈలెక్కింపులో అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, అనంత పురాణిక్, జేపీస్వామి, కృష్ణమూర్తి, దేశాయ్ నరసింహమూర్తి, గిరిధర్, సుజ్ఞానేంద్ర, శ్రీపాధాచార్, దత్తుస్వామి పాల్గొన్నారు.