Share News

నెల్లూరు‌కు మహర్దశ.. 14 కూడళ్లలో ఫౌంటెన్లు, ఐలాండ్ల అభివృద్ధికి రూ.5.26 కోట్లు

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:50 PM

నెల్లూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఐలాండ్స్‌కు మహర్దశ పట్టనుంది. రూ.5.26 కోట్లతో ఐలాండ్‌ల అభివృద్ధి, ఫౌంటెన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నెల్లూరు‌కు మహర్దశ.. 14 కూడళ్లలో ఫౌంటెన్లు, ఐలాండ్ల అభివృద్ధికి రూ.5.26 కోట్లు
Minister Narayana

నెల్లూరు, సెప్టెంబర్ 26: నగరంలోని ప్రధాన కూడళ్లలో ఐలాండ్స్‌కు మహర్దశ పట్టనుంది. రూ.5.26 కోట్లతో ఐలాండ్‌ల అభివృద్ధి, ఫౌంటెన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈరోజు(శనివారం) నగరంలోని 14 కూడళ్లలో ఫౌంటెన్ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శంకుస్థాపన చేసిన 14 కూడళ్లలోని ఫౌంటెన్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే, ఆర్యవైశ్యులు కోరిన విధంగా ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సిటీలో 17 పాఠశాలల ఆధునికీకరణకు రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు.


ఎనిమిది పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. మూడు స్కూల్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్ది ప్రారంభించామని.. మరో మూడు పాఠశాలలకు శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. ప్రతిరోజు పది అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా 123 మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు రూ.50 వేల కోట్లు కేటాయించారన్నారు. రూ.23 వేల కోట్లతో ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఎన్నికల్లో చెప్పిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిసెంబర్‌లోపు ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్‌’ ప్రచారం: మంత్రి దుర్గేష్

దుర్గగుడి ఘాట్‌రోడ్డుకు శాశ్వత రక్షణ చర్యలు.. దసరాకు సురక్షితంగా ఉండేలా ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 12:55 PM