Share News

గుండ్లకమ్మ, రాళ్లపాడు రిజర్వాయర్లకు వరద ముప్పు!.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:15 PM

మురుసు తుపాను నేపథ్యంలో గుండ్లకమ్మ, రాళ్లపాడు రిజర్వాయర్లకు వరద వచ్చే అవకాశాలున్నట్లు జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గుండ్లకమ్మ, రాళ్లపాడు రిజర్వాయర్లకు వరద ముప్పు!.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు
Flood Alert for Reservoirs

అమరావతి, నవంబర్ 2: రాష్ట్రంలో మురుసు నేపథ్యంలో జలవనరుల అభివృద్ధి శాఖామంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు తగు సూచనలు అందజేశారు.


సాగర్ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ క్రమంలో గుండ్లకమ్మ, రాళ్లపాడు రిజర్వాయర్లకు వరద వచ్చే అవకాశాలున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలను గమనించాలని సూచించారు. ఇతర శాఖలతో సమన్వయం అవుతూ.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.


ఇవి కూడా చదవండి...

ఎర్రన్నాయుడు ఆశయాలే నా మార్గం.. ప్రజాసేవే నా లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు

మురసు తుఫాన్‌పై అప్రమత్తతో వ్యవహరించాలి.. అధికారులకు పవన్ ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 12:25 PM