తుది దశకు నకిలీ మద్యం కేసు కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి
ABN , Publish Date - Sep 16 , 2026 | 07:00 AM
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. కోర్టు వారికి సెప్టెంబరు 28 వరకు రిమాండ్ విధించడంతో ఎక్సైజ్ పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
ములకలచెరువు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం కేసు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులైన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డి మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో లొంగిపోయారు.
న్యాయమూర్తి సుబహాన్ వీరికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. దీంతో నిందితులను ఎక్సైజ్ పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ములకలచెరువు కేంద్రంగా జరిగిన నకిలీ మద్యం తయారీ గుట్టును గతేడాది అక్టోబరు 3న ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. ఈ కేసులో 33 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో దాసరిపల్లె జయచంద్రారెడ్డి(ఏ17), ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డి (ఏ18)గా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అలయ్ బలయ్‌కు రండి: బాబుకు దత్తన్న ఆహ్వానం
రేపు వారాణసికి సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News