అలయ్ బలయ్‌కు రండి: బాబుకు దత్తన్న ఆహ్వానం
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:46 AM
అక్టోబరు 22న హైదరాబాద్‌లో జరగనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ ఆహ్వానం అందించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సోమవారం, జుబ్లీహిల్స్‌లోని బాబు నివాసానికి వెళ్లిన దత్తాత్రేయ... అక్టోబరు 22న నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన్ను ఆహ్వానించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అలయ్ బలయ్ ప్రతీకగా నిలుస్తూ వస్తోందని దత్తాత్రేయ వివరించారు. కార్యక్రమానికి తప్పకుండా వస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని బండారు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీతోనే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
రేపు వారాణసికి సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News