Share News

డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీతోనే వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:39 AM

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీకి అప్పగించిన ప్రక్రియను వెనక్కి తీసుకుని డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా నియామకాలు చేపట్టనుంది.

డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీతోనే వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ
Veterinary Assistant Surgeon recruitment

  • ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ఇచ్చిన

  • జీవో 21 ఉపసంహరణ

అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) పోస్టుల భర్తీ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)కి అప్పగిస్తూ ఈ నెల 13న ఇచ్చిన జీవో21ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2016లో ఇచ్చిన జీవో 52ను కొనసాగిస్తూ సోమవారం జీవో 22ను జారీచేసింది. జాబ్‌ క్యాలెండర్‌-2026 రెండో దశలో వీఏఎస్‌ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ ప్రక్రియను ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించాలని భావించి, జీవో 21ని జారీ చేసింది. అయితే ఒక్కరోజులోనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. గతంలో మాదిరిగా డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా వీఏఎస్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను నిర్వహించడం సముచితమని భావించింది. మెరిట్‌ ఆధారంగా ఎంపిక పద్ధతిని, ప్రత్యేక నిబంధనలకు లోబడి అభ్యర్థులకు వర్తించే వెయిటేజ్‌ని అనుసరించాలని నిర్ణయించింది. రిజర్వేషన్‌, రోస్టర్‌ నిబంధనలను వర్తింపజేయాలని నిర్ధేశించింది. అయితే ఈ విధానం జాబ్‌ క్యాలెండర్‌-2026కు మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్‌ నియామకాలకు ఈ విధానం ఉదాహరణగా పరిగణించబడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

22 నాటికి ఫొటో ఓటర్ల జాబితా సిద్ధం!
రేపు వారాణసికి సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 06:39 AM