వర్షాల నేపథ్యంలో ప్రత్యేక కాల్‌సెంటర్లను ఏర్పాటు చేయండి: మంత్రి నారాయణ
ABN , Publish Date - Sep 24 , 2026 | 09:24 PM
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అమరావతి, సెప్టెంబర్ 24: వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా నిరంతర పర్యవేక్షించాలన్నారు. డ్రెయిన్లలో సిల్ట్ తొలగించి మురుగునీటి ప్రవాహం సాఫీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఇంజనీరింగ్, పారిశుధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రోడ్లపై విరిగిపడిన చెట్ల తొలగించేందుకు అవసరమైన యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ మేరకు ప్రతి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన వనరులను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి నారాయణ సూచనలు జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్
కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ చీఫ్ మద్దతు