శ్రీశైలం దేవస్థానం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో ఇబ్బందులు.. ఆ సంస్థపై దేవాదాయ శాఖ ఆంక్షలు
ABN , Publish Date - Jul 30 , 2026 | 03:21 PM
శ్రీశైలం దేవస్థానంలో ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌లో ఇబ్బందులు, ఆన్‌లైన్ వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర యాప్‌లో టికెట్ల బుకింగ్ ప్రక్రియలో అంతరాయం నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
నంద్యాల, జులై 30: శ్రీశైలం దేవస్థానంలో ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌లో ఇబ్బందులు, ఆన్‌లైన్ వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర యాప్‌లో టికెట్ల బుకింగ్ ప్రక్రియలో అంతరాయం నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన 9&9 సంస్థపై దేవాదాయ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. 9&9 సంస్థ.. 2021 నుంచి దేవస్థానం కోసం వెబ్‌సైట్‌ను రూపొందించి, ఆన్‌లైన్ టికెట్ల జారీ ప్రక్రియను నిర్వహిస్తోంది.
టికెట్ బుకింగ్‌లో అంతరాయం నేపథ్యంలో 9&9 సంస్థపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న దేవాదాయ శాఖ అధికారులు.. టీఎంఎస్(TMS) సంస్థ ద్వారా టికెట్లను జారీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సంస్థ ద్వారా త్వరలోనే టికెట్ల బుకింగ్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే గతంలో టీఎంఎస్ సంస్థ ద్వారా టికెట్ల జారీ నిర్వహించిన సమయంలో అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో మళ్లీ అదే సంస్థకు బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై దేవాదాయ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు: ఆదోని చిన్నారులతో లోకేశ్ ఫొటో
సూపర్ ఎల్‌నినోపై రైతుల్లో అవగాహన కల్పించాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News