Share News

శ్రీశైలంలో భక్తులకు తృటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Feb 22 , 2026 | 07:34 AM

శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానిక వీఐపీ కాటేజీలో ఆదివారం ఉదయం ఏసీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

శ్రీశైలంలో భక్తులకు తృటిలో తప్పిన ప్రమాదం
Srisailam Temple

నంద్యాల, ఫిబ్రవరి 22: శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానిక వీఐపీ కాటేజీలో ఆదివారం ఉదయం ఏసీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం స్థానిక పోలీసులకు భక్తులు సమాచారం అందించారు. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వీఐపీ కాటేజీ వద్దకు చేరుకుని.. మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని పోలీసులు వెల్లడించారు.


ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఆదివారం కావడంతో భక్తులు భారీగా శ్రీశైలానికి తరలివచ్చారు. స్థానికంగా అన్ని రూమ్‌లు భక్తులతో నిండిపోయాయి. దేవాలయంలోని క్యూ లైన్‌లు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల తాకిడితో స్వామి, అమ్మవార్ల దర్శనానికి సమయం పడుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీశైలం ఘాట్ రోడ్ల వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ స్టీల్‌ ప్లాంటు డైరెక్టర్‌ రాజీనామా?

తెలుగువారందరూ ఒక్కటే.!

For AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 10:55 AM