బనగానపల్లె సర్పంచ్‌గా మంత్రి భార్య బీసీ ఇందిరా రెడ్డి ఏకగ్రీవం
ABN , Publish Date - Nov 24 , 2026 | 09:08 PM
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న వేళ.. నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నంద్యాల, నవంబర్ 24: గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న వేళ.. జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబంలో రాష్ట్ర మంత్రిగా భర్త ఉండగా.. గ్రామ ప్రథమ పౌరురాలిగా ఆయన భార్య బాధ్యతలు చేపట్టనున్నారు. బనగానపల్లె పంచాయతీలోని మొత్తం 20 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నవంబర్ 19న బనగానపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బి.సి. ఇందిరా రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమానికి భర్త, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. కూటమిలోని పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. దీంతో బనగానపల్లె పంచాయతీ సర్పంచ్ ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికయితే బనగానపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని బీసీ ఇందిరా రెడ్డి ప్రకటించారు.
ఫ్యామిలీ పాలిటిక్స్..
మరోవైపు రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. తండ్రి ఎమ్మెల్యే అయితే.. వారి కుమార్తె లేదా కుమారుడు జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తరహ ఘటనలు చోటు చేసుకున్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె సాయి నవ్యశ్రీ ఏలూరు జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ సైతం శ్రీసత్యసాయి జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ పంచాయతీ ఎన్నికలకు పోలీసులతో భారీ భద్రత.. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణలో రూ.10 వేల కోట్ల ప్రణాళిక: మంత్రి ఉత్తమ్