అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్‌కే దక్కుతుంది: పట్టాభి
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:44 PM
ఏపీలో భగీరథ ప్రయత్నం జరుగుతోందని ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ అన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందని చెప్పుకొచ్చారు.
కర్నూలు, సెప్టెంబర్ 2: ఏపీలో భగీరథ ప్రయత్నం జరుగుతోందని ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ అన్నారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్ తొలిదశను సీఎం చంద్రబాబు ప్రారంభించారని.. పోలవరం కాలువను కొద్ది గంటల్లో ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందని చెప్పుకొచ్చారు. రాయలసీమకు నీటి విషయంలో న్యాయం జరుగుతోందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రాజెక్ట్‌ల క్యాలెండర్‌ను తాము విడుదల చేసినట్లు చెప్పారు. 36 ప్రాజెక్టుల్లో 14 ప్రాజెక్టులు రాయలసీమలో ఉన్నాయన్నారు. గొడ్డలి పార్టీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
రాయలసీమకు జగన్ చేసింది ఏమి లేదని పట్టాభి విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి సీమ ప్రాజెక్టులకు కనీసం రూ.రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. కుప్పానికి నీరు విడుదలని చెప్పి ట్యాంకర్‌లతో నీరు తెచ్చి జగన్ డ్రామా ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పానికి సీఎం చంద్రబాబు నీరు తీసుకెళ్లారన్నారు. అన్నమయ్య డ్యాంకు గ్రీస్ కూడా పూయలేకపోయారని వ్యాఖ్యానించారు. టీబీ డ్యాం గేట్లు మార్చి నీటి నిల్వ భద్రత, భరోసా కల్పించింది సీఎం చంద్రబాబు అని అన్నారు. సీమలో ప్రాజెక్టుల అభివృద్ధి పనులు బాగున్నాయని వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. పోలవరం పనులను 17 నెలలు ఆపేశారని.. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం జగన్ అంటూ మండిపడ్డారు.
కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరించారని పట్టాభి తెలిపారు. అనుమతులు లేని రాయలసీమ లిఫ్ట్ పేరుతో ప్రజలను మోసం చేశారని విరుచుకుపడ్డారు. మట్టి పనుల పేరుతో పెద్దిరెడ్డికి రూ.వెయ్యి కోట్లు దోచి పెట్టారన్నారు. కూటమి చేస్తున్న పనులు చూసి కడుపుమంటతో జగన్ అల్లాడిపోతున్నారన్నారు. మనుషులకే కాదు అడవిలోని వన్యప్రాణులు కూడా బయటికి వచ్చి వెలిగొండ నీరు త్రాగుతున్నాయని తెలిపారు. అపర భగీరథుడిలా చంద్రబాబు ప్రాజెక్టులను పూర్తి చేసి చూపించారన్నారు. క్రెడిట్ చోరీ డిజార్డర్‌తో(CCD) గొడ్డలి పార్టీ నేతలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. జలయజ్ఞం అంటే ధనయజ్ఞం కాదని పట్టాభి రామ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
కాలికి గాయంతో ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లిన వ్యక్తి.. కాసేపటికే
జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ
Read Latest AP News And Telugu News