Share News

అర్హులకు త్వరలో కొత్త ఇళ్లు, పెన్షన్లు : మంత్రి నిమ్మల రామానాయుడు

ABN , Publish Date - Aug 24 , 2026 | 03:36 PM

ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ఎల్‌ఎల్‌సీ, హెచ్‌ఎల్‌సీ కాలువలకు సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

అర్హులకు త్వరలో కొత్త ఇళ్లు, పెన్షన్లు : మంత్రి నిమ్మల రామానాయుడు
Nimmala Ramanaidu

కర్నూలు, ఆగస్టు 24: ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ఎల్‌ఎల్‌సీ, హెచ్‌ఎల్‌సీ కాలువలకు సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వంద శాతం విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రైజింగ్ స్టార్‌గా నారా లోకేశ్ నాయకత్వంలో డ్రోన్ హబ్‌తో పాటు పలు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలకు తాగునీటిని అందించి ఆదుకుంటామన్నారు.


కర్నూలు జిల్లాకు రెండు విడతల్లో మొత్తం 10 గురుకుల పాఠశాలలు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. జిల్లాలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఆలూరుకు ఒక గురుకుల పాఠశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. డీఎస్సీ ద్వారా మరోసారి ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు మంత్రి లోకేశ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.


పోలవరం, రాయలసీమ అంశాలపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదని నిమ్మల విమర్శించారు. గత రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారనే అంశంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. అర్హులైన ప్రజలకు కొత్త ఇళ్లు, పెన్షన్లను త్వరలో అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

కాస్త ఆలస్యమైనా నదుల అనుసంధానం పక్కా: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

సోషల్‌ మీడియా ప్రచారంపై ఏపీ SEC అనిల్‌ చంద్ర పునేఠా స్పందన

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 03:48 PM