Share News

ఆర్‌యూ రిజిస్ట్రార్‌కు ఏపీ హైకోర్టు షాక్.. బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..

ABN , Publish Date - Apr 09 , 2026 | 08:16 PM

రాయలసీమ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. వాయిదాలకు గైర్హాజరు కావడంపై ధర్మాసనం ఆగ్రహించింది. ఈ మేరకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఆర్‌యూ రిజిస్ట్రార్‌కు ఏపీ హైకోర్టు షాక్.. బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..
AP High Court

కర్నూలు: రాయలసీమ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. వాయిదాలకు గైర్హాజరు కావడంపై ధర్మాసనం ఆగ్రహించింది. ఈ మేరకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో యూనివర్శిటీ విధుల నుంచి తమను తొలగించడంపై ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.


అయితే కోర్టు ఆదేశాల అమలులో యూనివర్శిటీ రిజిస్ట్రార్ విజయ్ కుమార్ నాయుడు నిర్లక్ష్యం వహించారు. 52 రోజులపాటు వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయించారు సదరు కాంట్రాక్టు ఉద్యోగులు. తమకు 52 రోజుల జీతం కూడా ఇప్పించాలని విన్నవించారు. వాయిదాలకు రాకపోవడం, కోర్టు ఉత్తర్వులు అమలు చేయడంలో జాప్యం చేసినందున రిజిస్ట్రార్ విజయ్ కుమార్ నాయుడుపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ధర్మాసనం. ఇప్పటికే యూనివర్శిటీలో పలు అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు సంచలనంగా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ఎవరిని ధ్వంసం చేస్తారు..?: రాజకీయ ఫ్లెక్సీలపై హైకోర్టు సీరియస్..

మోహన్ బాబుపై తొందరపాటు చర్యలు వద్దు: హైకోర్టు

Updated Date - Apr 09 , 2026 | 08:27 PM