ఎవరిని ధ్వంసం చేస్తారు..?: రాజకీయ ఫ్లెక్సీలపై హైకోర్టు సీరియస్..
ABN , Publish Date - Apr 09 , 2026 | 07:48 PM
ఎల్ఓసీ రద్దు చేయాలని వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ఫ్లెక్సీలపై రాస్తున్న రాతలపై తీవ్రంగా స్పందించింది.
అమరావతి: ఎల్ఓసీ రద్దు చేయాలని వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ఫ్లెక్సీలపై రాస్తున్న రాతలపై తీవ్రంగా స్పందించింది. 2029లో చేయబోయే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నామని రాస్తారా? అని పిటిషనర్‌ని నిలదీసింది. ఎవరిని ధ్వంసం చేస్తారు..? రాష్ట్రాన్నా... ప్రజలనా...? అంటూ మండిపడింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆగ్రహించింది.
పోలీసుల చేతకానితనంతోనే అసభ్యకర పోస్టులు పెడుతూ అనుచిత రాతలు రాస్తున్నారని సీరియస్ అయ్యింది హైకోర్టు. ఒకసారి అరెస్టయిన వారు కూడా తిరిగి అదే రీతిలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని కోపగించుకుంది. జడ్జిలపై పోస్టులు పెట్టినప్పుడే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండేదని ధర్మాసనం తెలిపింది. అనుచిత, అభ్యంతరకర పోస్టులను డీల్ చేయడంలో ఖాకీలు విఫలమయ్యారని ఘాటుగా స్పందించింది.
పోలీసుల అసమర్థత కారణంగానే అసభ్యకర పోస్టులు పునరావృతం అవుతున్నాయని హైకోర్టు విమర్శించింది. ముఖ్యమంత్రిపై అనుచిత పోస్టులు పెట్టడమంటే 5 కోట్ల మంది ఆంధ్రులని అవమానించడమే అని విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ఒకరి కుటుంబాన్ని అవమానించే హక్కు మరొకరికి ఉండదని తేల్చి చెప్పింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స