తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:33 PM
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పథకాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అంతర్వేదిలో రూ.17.33 కోట్ల వ్యయంతో నిర్మించునున్న తాగునీటి పథకాన్ని వర్చువల్ విధానం ద్వారా వారిద్దరూ ప్రారంభించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా: జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పథకాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అంతర్వేదిలో రూ.17.33 కోట్ల వ్యయంతో నిర్మించునున్న తాగునీటి పథకాన్ని వర్చువల్ విధానం ద్వారా వారిద్దరూ ప్రారంభించారు. అలాగే మల్కిపురం మండలం గుడిమెళ్లంకలో రూ.5 కోట్ల ఓఎన్జీస్ నిధులతో నిర్మించ తలపెట్టిన సురక్షిత తాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణానికీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మహేశ్ కుమార్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, టీడీపీ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తప్పు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు: హోం మంత్రి అనిత
‘మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు