తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే ప్రశ్న.. మంత్రి నాదెండ్ల సమాధానం
ABN , Publish Date - Aug 20 , 2026 | 11:51 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రశ్నించారు.
అమరావతి, ఆగస్టు 20: ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రశ్నించారు. బీచ్ రోడ్డు వెంబడి తీరప్రాంతాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలు, తీర రక్షణకు సంబంధించి సీఆర్ జెడ్ అనుమతులను త్వరితగతిన పొందేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే ప్రశ్న వేయగా.. మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ ద్వారా సీఆర్ జెడ్ అనుమతులు మంజూరు చేస్తారని మంత్రి తెలిపారు. సీఆర్ జెడ్ అనుమతుల కోసం పరివేశ్ అనే పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఫారెస్ట్, ఎన్విరాన్మెంటల్ అనుమతుల తరువాతే ఈ పోర్టల్‌లో ధరఖాస్తు చేయగలుగుతామని చెప్పారు. ప్రస్తుతం 2011 సీఆర్ జెడ్ ప్రకటనకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపుతున్నారని తెలిపారు.
నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 12 తీర ప్రాంత జిల్లాలకు ప్రజాభిప్రాయ సేకరణ రిపోర్టు ఇచ్చిందన్నారు. విశాఖకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ఇంకా పూర్తికాలేదని.. రెండు సార్లు వాయిదా పడిందని తెలిపారు. మదురవాడ నుంచి భీమునిపట్నం వరకూ పున:వర్గీకరించాలని ప్రజలు వినతి చేస్తున్నారన్నారు. ఇప్పటికే రెండు సార్లు విశాఖలో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేశారని, ఈసారి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న మరోసారి నిర్వహిస్తున్నామని, ఇందుకు ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో షహజాద్ భట్టీ నెట్‌వర్క్ జాడలు
క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా?
Read Latest Telangana News And Telugu News