హైదరాబాద్‌లో షహజాద్ భట్టీ నెట్‌వర్క్ జాడలు
ABN , Publish Date - Aug 20 , 2026 | 10:53 AM
హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పాక్ ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో హైదరాబాద్‌కు సంబంధాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ, మేడ్చల్ ప్రాంతాల్లో కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. గతంలో అరెస్టైన ఇద్దరు యువకులకు ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉగ్రకుట్ర కేసులో భాగంగా ఇటీవల దేశవ్యాప్తంగా 253 మంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 14 రాష్ట్రాల్లో 253 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
253 మందిలో తెలంగాణ నుంచి ఇద్దరు అరెస్టైనట్లు గుర్తించారు. వీరికి గాజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జాయిద్ ఖాన్‌కు కీలక లింకులు ఉన్నట్లు బయటపడింది. జాయిద్ ఖాన్.. ఫిబ్రవరిలో మేడ్చల్‌లోని ఓ రెస్టారెంట్లో పనిచేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో పరిచయం ఏర్పడిందని, అనంతరం ఐఎస్ఐ సానుభూతిపరులతో జాయిద్ ఖాన్ చాటింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ఐఏఎస్ సానుభూతిపరులు హమీద్, రాణా హుస్సేన్‌లతో జాయిద్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్.. వీరి చాటింగ్‌పై నిఘా పెట్టింది.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో సెక్షన్ 22Aపై రాహుల్‌కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
నగల బ్యాగ్‌ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత
Read Latest Telangana News And Telugu News