Share News

ఉప్పాడ మత్స్యకారుల కోసం పారాదీప్ సముద్ర జలాల్లో గాలింపు

ABN , Publish Date - Nov 25 , 2026 | 11:53 AM

కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డు, నేవీ హెలికాప్టర్లతో పారాదీప్ సముద్ర జలాల్లో గాలింపు చేపట్టారు.

ఉప్పాడ మత్స్యకారుల కోసం పారాదీప్ సముద్ర జలాల్లో గాలింపు
Paradip Fishermen Search

కాకినాడ, నవంబర్ 25: జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డు, నేవీ హెలికాప్టర్లతో పారాదీప్ సముద్ర జలాల్లో గాలింపు చేపట్టారు. మత్స్యకారుల ఆచూకీని కనిపెట్టి క్షేమంగా తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉప్పాడ సముద్ర తీరం నుంచి ఈనెల 11న సింహాద్రి అనే బోటు యజమానితో సహా ఏడుగురు మత్స్యకారులు ఒడిస్సా రాష్ట్రం పూరి సమీపంలో పారదీప్ తీరానికి వేటకు చేపల వెళ్లినట్లు కుటుంబసబ్యులు చెబుతున్నారు.


ఈనెల 13న ఇంటికి ఫోన్ చేసి, తాము ఉన్న ప్రాంతంలో తుపాను ఉన్నట్లు కుటుంబ సభ్యులతో మత్స్యకారులు మాట్లాడారు. తరువాత నుంచివారి ఫోన్ కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మత్స్యకారులు ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అధికారులతో ఏపీ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. తుపాను ప్రభావంతో బోటు ఇతర దేశాల సముద్ర జలాల వైపు కొట్టుకుపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గల్లంతైన బోటు ఆచూకీ కోసం బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు కూడా సమాచారం అందించారు. బోటులో 1,500 లీటర్ల డీజిల్, 30 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.


కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కాకినాడ, పారాదీప్ కోస్ట్‌గార్డ్, చెన్నై ఎమ్‌ఆర్‌సీసీ సమన్వయంతో విస్తృతంగా గాలింపు జరుగుతోందన్నారు. మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని.. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్ జిల్లా కనుమూరు ఫారెస్ట్‌లో పెద్దపులి మకాం.. ఐదోరోజూ గాలింపు

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. మూడో విడత నామినేషన్ల పరిశీలన పూర్తి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 12:06 PM