Share News

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. మూడో విడత నామినేషన్ల పరిశీలన పూర్తి

ABN , Publish Date - Nov 25 , 2026 | 11:04 AM

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల పరిశీలన పూర్తైంది. పరిశీలన అనంతరం చెల్లుబాటైన అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు.

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. మూడో విడత నామినేషన్ల పరిశీలన పూర్తి
AP Panchayat Elections

విజయవాడ, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల పరిశీలన పూర్తైంది. పరిశీలన అనంతరం చెల్లుబాటైన అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లోని 46 రెవెన్యూ డివిజన్లు, 214 మండలాల్లో మూడో విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.


మూడో విడతలో మొత్తం 4,244 సర్పంచ్ స్థానాలు, 42,712 వార్డు సభ్యుల స్థానాలు నోటిఫై అయ్యాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం సర్పంచ్ పదవులకు సంబంధించి 22,309 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వార్డు సభ్యుల స్థానాలకు 99,220 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి.


సర్పంచ్ స్థానాలకు సంబంధించి అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 325 స్థానాలకు గాను 1,588 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. నెల్లూరు జిల్లాలో 267 సర్పంచ్ స్థానాలకు 1,462, విజయనగరం జిల్లాలో 244 స్థానాలకు 1,330 నామినేషన్లు ఆమోదం లభించాయి. ఇక వార్డు సభ్యుల నామినేషన్లలో నెల్లూరు జిల్లా ముందజలో ఉంది. ఈ జిల్లాలో 7,467 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. అలాగే విజయనగరం జిల్లాలో 7,267 నామినేషన్లు, అనకాపల్లి జిల్లాలో 6,427 నామినేషన్లు ఆమోదం పొందాయి.


null

ఇవి కూడా చదవండి...

ఏపీలో భారీ పెట్టుబడులు.. 54, 210 మందికి ఉపాధి అవకాశం!

ఎన్టీఆర్ జిల్లా కనుమూరు ఫారెస్ట్‌లో పెద్దపులి మకాం.. ఐదోరోజూ గాలింపు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 11:11 AM