Share News

తిరుపతిలో జులై 2న ట్రాఫిక్ డైవర్షన్.. ప్రజలకు కీలక సూచన..

ABN , Publish Date - Jun 29 , 2026 | 03:59 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు తిరుపతిలో జులై 2న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపును అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తిరుపతిలో జులై 2న ట్రాఫిక్ డైవర్షన్.. ప్రజలకు కీలక సూచన..
Tirupati Traffic Diversion

తిరుపతి, జూన్ 29: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు తిరుపతిలో జులై 2న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపును అమలు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా పోలీసులు వెల్లడించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ట్రాఫిక్‌ను సజావుగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు జులై 2న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్లు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.


ప్రజలకు విజ్ఞప్తి

తిరుపతిలో సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ డైవర్షన్లను పాటించాలని పోలీసులు సూచించారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలన్నారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సూచనలను తప్పనిసరిగా అనుసరించి సహకరించాలని కోరారు. అత్యవసర సేవల వాహనాలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. అందరూ పోలీసుశాఖకు సహకరించి అసౌకర్యాన్ని నివారించుకోవాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.


ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలివే..

  • తిరుపతి నుంచి కడప వైపు వెళ్లే వాహనాలు: రైల్వే కోడూరు సర్కిల్ - చిట్వేలి - బెస్తపల్లి - రాజంపేట NTR సర్కిల్ - కడప మీదుగా మళ్లింపు.

  • కడప నుంచి తిరుపతి వైపు వచ్చే వాహనాలు: రాజంపేట NTR సర్కిల్ - బెస్తపల్లి - చిట్వేలి - రైల్వే కోడూరు - తిరుపతి మీదుగా వెళ్లాలని సూచించారు.

  • పుల్లంపేట వైపు నుంచి వచ్చే వాహనాలను ఓబులవారిపల్లి క్రాస్ చిన్న వూరంపాడు వైకోట మార్గం ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవలసి ఉంటుందని తిరుపతి పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

రాధాగాయత్రి తల్లిదండ్రులకు పూర్తి సహకారం అందిస్తాం: హోం మంత్రి అనిత

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సీఐ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 29 , 2026 | 04:34 PM