Share News

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సీఐ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - Jun 29 , 2026 | 03:22 PM

గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకు సీఐ నాగరాజును కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ వేశారు.

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సీఐ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా
Sai Krishna Death Case

విజయవాడ, జూన్ 29: గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి విజయవాడలో ఏజేఎమ్‌ కోర్టులో రెండు పిటిషన్లపై ఈరోజు(సోమవారం) విచారణ జరిగింది. ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకు సీఐ నాగరాజును కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ వేశారు. 12 రోజుల పాటు సీఐను కస్టడీలోకి ఇస్తే పూర్తి స్థాయిలో విచారిస్తామని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీఐ తరఫున న్యాయవాదిని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేసింది.


ఇంటి భోజనానికి అనుమతి..

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు.. తనకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని, తన ఆరోగ్య కారణాల దృష్ట్యా బయటి ఆహారం పడదంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. సీఐ నాగరాజుకు ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

వర్షం ఎఫెక్ట్.. మధిర రైతు ఆశీర్వాద సభ రద్దు.. హైదరాబాద్‌కు షిఫ్ట్

రాధాగాయత్రి తల్లిదండ్రులకు పూర్తి సహకారం అందిస్తాం: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 29 , 2026 | 03:25 PM