Share News

ప్రధాని పిలుపుతోనే ఆన్‌లైన్‌లో టీడీపీ మహానాడు: మంత్రి కొల్లురవీంద్ర

ABN , Publish Date - May 16 , 2026 | 03:48 PM

నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సభ్యులు, తదితర ముఖ్య నాయకుల సమక్షంలో నిర్వహించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో క్లస్టర్స్ వారీగా స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ప్రధాని పిలుపుతోనే ఆన్‌లైన్‌లో టీడీపీ మహానాడు: మంత్రి కొల్లురవీంద్ర
TDP Mahanadu Online

కృష్ణాజిల్లా, మే 16: పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, తదితర ముఖ్య నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో క్లస్టర్స్ వారీగా స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహానాడు ఉద్దేశాలు, నిర్ణయాలను పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలియచేస్తామన్నారు. యుద్ధ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.


చర్యలు తప్పవు...

నిత్యావసర సరకులు అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి అభద్రతా భావానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించినట్లు చెప్పారు. ఈ కమిటీకి రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి నిత్యావసర సరకులను అధిక ధరలకు విక్రయిస్తే సహించమన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకమైన మానిటరింగ్ జరుగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ప్రతినెలా మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర’ తప్పనిసరి: మంత్రి కొల్లురవీంద్ర

పీఎం, సీఎం ఆదేశాలతో ఇంధన పొదుపుపై ప్రత్యేక ఫోకస్: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - May 16 , 2026 | 04:00 PM