Share News

స్వచ్ఛమైన పెనుకొండ కోసం ప్రజల సహకారం అవసరం: మంత్రి సవిత

ABN , Publish Date - May 16 , 2026 | 11:32 AM

పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని మంత్రి సవిత తెలిపారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించాలని ప్రజలకు సూచించారు.

స్వచ్ఛమైన పెనుకొండ కోసం ప్రజల సహకారం అవసరం: మంత్రి సవిత
Minister Savitha

శ్రీ సత్యసాయి జిల్లా, మే 16: ఇంధన పొదుపులో భాగంగా మంత్రి సవిత.. తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లి స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుకొండ పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛాంద్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ వీధిని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. అనంతరం సవిత మాట్లాడుతూ.. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని తెలిపారు.


ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించాలని ప్రజలకు మంత్రి సూచించారు. షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన పెనుకొండ కోసం ప్రజల సహకారం అవసరమని మంత్రి తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని సూచించారు. స్వచ్ఛాంద్ర - స్వర్ణాంధ్రతో గ్రామాలు, పట్టణాలు మరింత అందంగా మారుతాయని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పొదుపు చర్యలు.. బ్యాటరీ సైకిల్‌పై కలెక్టర్ లక్ష్మీశా

డప్పు కళాకారుల ప్రదర్శన.. సరికొత్త చరిత్రకు నాంది: పీవీఎన్ మాధవ్

Read Latest AP News And Telugu News

Updated Date - May 16 , 2026 | 11:40 AM