మద్యం కుంభకోణం కేసులో అవినాశ్ రెడ్డికి బెయిల్
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:53 PM
మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అవినాశ్ ఏ-7గా ఉన్నారు.
న్యూఢిల్లీ, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో(Supreme Court) ఊరట లభించింది. అవినాశ్‌కు సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఏ-7గా ఉన్న అవినాశ్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. కోర్టు అనుమతితో జరిగిన ఈ విచారణలో అవినాశ్ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్ర, అంతిమ లబ్ధిదారుడికి సంబంధించిన విషయాలపై అవినాశ్ రెడ్డి వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్‌లో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉండగా, అవినాశ్ రెడ్డి ఆర్థిక నియంత్రణ, లావాదేవీలలో ముఖ్యపాత్ర వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
మొదలైన తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు ఎంత కేటాయించారంటే..
Read Latest AP News And Telugu News