విరిగిన స్టీరింగ్ రాడ్.. పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:12 PM
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.
కృష్ణా జిల్లా, జూన్ 8: కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న 20మంది ప్రయాణికులు చిన్న గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గన్నవరం డిపోకు చెందిన 220 నంబర్ ఆర్టీసీ బస్సు తెన్నేరు నుంచి గన్నవరం వైపు వెళ్తుండగా, తెన్నేరు–మంతెన మధ్య మార్గంలో ఒక్కసారిగా స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది.
దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి బస్సులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉండగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
బిహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
జగన్ పిచ్చితనానికి ట్రీట్‌మెంట్ ఎక్కడో తెలియడం లేదు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News