Share News

రామాయపట్నం పోర్టు పనులు వేగవంతం.. డ్రెడ్జింగ్, రోడ్డు-రైలు కనెక్టివిటీపై ఫోకస్

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:20 PM

రామాయపట్నం పోర్టుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. పోర్టుకు సంబంధించి డ్రెడ్జింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే అంతర్గత నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది.

రామాయపట్నం పోర్టు పనులు వేగవంతం.. డ్రెడ్జింగ్, రోడ్డు-రైలు కనెక్టివిటీపై ఫోకస్
Ramayapatnam Port

అమరావతి, ఏప్రిల్ 10: రామాయపట్నం పోర్టు పునరుద్ధరణ, డ్రెడ్జింగ్, అంతర్గత, బాహ్య రోడ్డు, రైలు కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉప సంఘం రెండవ సారి సమావేశమైంది. సచివాలయం రెండవ బ్లాక్‌లో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్ రెడ్డి భేటీ అయ్యారు. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనుల వేగవంతం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై సమావేశంలో మంత్రుల బృందం చర్చించింది. పోర్టుకు సంబంధించి డ్రెడ్జింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే అంతర్గత నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది.


పోర్టు నుంచి సరుకు రవాణా సులభతరం చేసేందుకు బాహ్య రోడ్లు, రైలు కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. రామాయపట్నం పోర్టు అందుబాటులోకి వస్తే దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

పాము కాటుకు గురైన బాలిక.. ఆస్పత్రికి తరలించే లోపే..

రాను రాను వ్యవస్థలు క్లిష్టంగా మారుతున్నాయి.. అధికారుల తీరును తప్పుబట్టిన సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 03:33 PM