Share News

చెప్పులు వేసుకొచ్చారంటూ విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ దారుణం

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:04 PM

విద్యార్థుల పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ దారుణంగా ప్రవర్తించారు. పాఠశాలకు బూట్లకు బదులు చెప్పులు వేసుకొచ్చారని విద్యార్థులకు చెప్పుల దండతో పనిష్మెంట్ ఇచ్చారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు.

చెప్పులు వేసుకొచ్చారంటూ విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ దారుణం
Uyyuru school controversy

కృష్ణాజిల్లా, మార్చి 7: ఉయ్యూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరు తీవ్ర కలకలం రేపుతోంది. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు బూట్లకు బదులు చెప్పులు ధరించి రావడంతో ప్రిన్సిపాల్ లక్ష్మి వారిపై దారుణంగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు ప్రిన్సిపాల్ చెప్పుల దండ వేసినట్లు పేరెంట్స్ చెబుతున్నారు. ఈ ఘటన నిన్న(శుక్రవారం) జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


సోషల్ మీడియా వీడియోల ఆధారంగా ఈరోజు(శనివారం) స్కూల్లో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్‌లను అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఉయ్యూరు డివిజన్ విద్యాశాఖ అధికారిణి పద్మారాణి మాట్లాడుతూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. అయితే, మీడియాతో మాట్లాడేందుకు విద్యాశాఖ అధికారులు నిరాకరించారు. విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రమశిక్షణ పేరుతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

వెంకన్నకు క్షమాపణ చెప్పరా?

అమ్మవారి దర్శనానికి వస్తే నగలన్నీ దోచేశారు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 07 , 2026 | 12:18 PM