నాలుగు వారాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి.. ఎమ్మెల్యేకు పవన్ సూచన
ABN , Publish Date - May 23 , 2026 | 02:57 PM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమావేశమయ్యారు. పోలవరం ఎమ్మెల్యేగా ఆయన పని తీరుపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు.
అమరావతి, మే 23: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈరోజు(శనివారం) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. పోలవరం ఎమ్మెల్యేగా ఆయన పని తీరుపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం నియోజకవర్గ పరిధికి సంబంధించి పార్టీ దృష్టికి వచ్చిన విషయాలు, ఆరోపణలపై ఎమ్మెల్యేను పవన్ వివరణ అడిగినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చక్కదిద్దుకొనేందుకు కొంత గడువు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరగా.. నాలుగు వారాల్లోగా చక్కదిద్దుకోవాలని పవన్ సూచించినట్లు సమాచారం.
పోలవరం నియోజకవర్గంలోని పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు రూ.147 కోట్లు కేటాయించారు. ఆ పనుల పురోగతిపైనా డిప్యూటీ సీఎం సమీక్ష చేశారు. పనుల సకాలంలో వేగంగా పూర్తి చేయకపోవడంపై పవన్ ప్రశ్నించారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేస్తానని, వ్యక్తిగత వ్యవహారాలు చక్కదిద్దుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బాలరాజు చెప్పారు.
ఇవి కూడా చదవండి...
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్
అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేద్దాం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News