Share News

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఘటనలో గాయపడ్డ న్యాయవాది కన్నుమూత

ABN , Publish Date - May 23 , 2026 | 01:50 PM

హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ వద్ద కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ న్యాయవాది తుదిశ్వాస విడిచారు.

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఘటనలో గాయపడ్డ న్యాయవాది కన్నుమూత
Hyderabad Lawyer Death

హైదరాబాద్, మే 23: మాసబ్‌ట్యాంక్‌ వద్ద కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ న్యాయవాది తుదిశ్వాస విడిచారు. ఈరోజు(శనివారం) ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన మొయినుద్దీన్‌ను.. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న దుండగులు కారుతో ఢీకొట్టారు. న్యాయవాది తన కారు వద్దకు వచ్చి వెనక సీట్లో బ్యాగు పెట్టి.. డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చోబోతున్న సమయంలో ఒక్కసారిగా దుండగులు కారుతో అతివేగంగా దూసుకొచ్చి బలంగా ఢీకొట్టారు. క్షణాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది.


న్యాయవాదికి తీవ్రమైన గాయాలవడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే న్యాయవాది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చివరకు చికిత్స పొందుతూ మొయునుద్దీన్ ప్రాణాలు కోల్పోయారు. న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. కారు నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన ప్రత్యర్థులు..

టెక్నోరీచ్ సీఈఓపై వేధింపుల ఆరోపణలు.. కేసు నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 23 , 2026 | 01:57 PM