తెలంగాణ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల..
ABN , Publish Date - May 23 , 2026 | 12:11 PM
తెలంగాణ పాలిసెట్ 2026 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈసారి లక్షకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 82.94 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్-2026 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈసారి మొత్తం 1,06,439 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, అందులో 98,029 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 82.94గా నమోదైంది. బాలికలు మరోసారి ప్రతిభ చాటుతూ బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 79.9గా ఉండగా, బాలికల ఉత్తీర్ణత శాతం 86.38గా నమోదైంది.
స్ట్రీమ్‌ల వారీగా చూస్తే MPC విభాగంలో 81,307 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, MBiPC స్ట్రీమ్‌లో 79,652 మంది అర్హత పొందారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాల అనంతరం కాల్ లెటర్ ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు PJTAU (Professor Jayashankar Telangana State Agricultural University), SKLTHU (Sri Konda Laxman Telangana Horticultural University), PVNRTVU( P.V. Narasimha Rao Telangana Veterinary University)లో ప్రవేశాలకు అర్హత పొందనున్నారు. వ్యవసాయం, సీడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరేందుకు ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి.
ఇవి కూడా చదవండి...
యాదాద్రిలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.100కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్‌లో న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన ప్రత్యర్థులు..
Read Latest Telangana News